తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని అమలాపురం రోడ్లో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో రాత్రి చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు.. కాపలదారుడిని కత్తులతో బెదిరించి దుకాణం తాళాలను పగలగొట్టారు. ఆ సమయంలో నగదు కౌంటర్లో డబ్బులు లేకపోవటంతో..రూ.20 వేలు విలువ చేసే మద్యం సీసాలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్రభుత్వ మద్యం దుకాణంలో మందుబాబులు చోరీ - east godavari district liquor theft news
దొంగతనం చేయాలనే ఆలోచన ఉంటే చాలు.. ఎక్కడైనా దోచేసేస్తారు దొంగలు. అది ప్రభుత్వానికి చెందిందైనా.. ప్రైవేటు వాళ్ల ఆస్తి అయినా లెక్క చేయరు. తాజాగా ప్రభుత్వ మద్యం దుకాణానికే దొంగలు కన్నమేసిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది.
మద్యం చోరీ