ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: తెరపై పడని బొమ్మ.. థియేటర్ సిబ్బంది ఆదాయం సున్నా.. - తూర్పుగోదావరి జిల్లాలో సినిమా హాళ్లు

సినిమా... ఎవర్ గ్రీన్ వినోద మాధ్యమం. టీవీల్లో ఎన్ని ప్రోగాములు వచ్చినా.. ఓటీటీల్లో మరెన్నో సిరీస్​లు చూసినా.. థియేటర్​కి వెళ్లి చిత్రం చూస్తే వచ్చే కిక్కే వేరు. అభిమాన కథానాయకుడి సినిమా విడుదలప్పుడు పెట్టే కటౌట్​లు, తెగే టికెట్లు, కొట్టే చప్పట్లు, వేసే ఈలలు... ఇవన్నీ మరేదాంతోనూ పోల్చి చూడలేం. ఇది సగటు అభిమాని ఆనందం. ప్రేక్షకులకు సినిమా ఆనందమైతే... మరికొందరికి అది జీవనోపాధి. థియేటర్​లో వేసే సినిమాపై ఆధారపడి ఎంతో మంది బతుకుతుంటారు. వారి ఆదాయానికి గండి కొట్టింది కరోనా. ఈ మహమ్మారి వలన సినిమాహాళ్ల సిబ్బంది పడుతున్న ఇబ్బందులపై ప్రత్యేక కథనం..

theatre staff problems due to corona
థియేటర్లపై కరోనా ప్రభావం

By

Published : Jun 25, 2020, 4:27 PM IST

సినిమా.. అభిమానులు, ప్రేక్షకులను ఆనందపరచడమే కాదు.. ఎంతోమందికి జీవనాధారం కూడా. ప్రొజెక్ట్ ఆపరేటర్లు, బుకింగ్ క్లర్కులు, గేట్ మెన్లు, చిరు వ్యాపారులు ఇలా ఎంతోమంది ఈ రంగంపై ఆధారపడి బతుకుతారు. అలాంటి వారిని కరోనా కష్టాల పాలు చేసింది. తెరపై బొమ్మపడి 100 రోజులు అయ్యింది. పనిలేక, ఆదాయం రాక వారు నానా కష్టాలు పడుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం, కేంద్రపాలిత ప్రాంతం యానాంలోనూ కలిపి 10 సినిమా థియేటర్లు ఉన్నాయి. కరోనా కారణంగా మార్చి 22 నుంచి హాళ్లు మూతపడ్డాయి. ఇప్పటికీ పెద్ద తెరపై బొమ్మ పడలేదు. ఈ ప్రభావం థియేటర్ సిబ్బందిపై తీవ్రంగా పడింది. ప్రతి హాలులో దాదాపు 20 మంది వరకు రోజువారీ ఉపాధి పొందుతుంటారు. క్లర్కులు, సైకిల్ స్టాండ్ ఆపరేటర్లు, చిరు తిళ్లు అమ్ముకునేవారు ఇలా సినిమాపై ఆధారపడి బతికేవారు ఎందరో ఉన్నారు. వీరంతా 3 నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. థియేటర్ యాజమాన్యం కొంతవరకూ సహాయం చేసినా కుటుంబ పోషణ భారంగానే ఉందంటూ వాపోతున్నారు.

ఇప్పుడు లాక్ డౌన్ ఆంక్షలు సడలించినప్పటికీ థియేటర్లకు మాత్రం అనుమతి లేదు. తామంతా ఏళ్ల తరబడి హాళ్లను నమ్ముకునే బతుకుతున్నామని.. ఇప్పుడు తమకు వేరే ఉపాధి మార్గం దొరకట్లేదని చెప్తున్నారు. థియేటర్​లో బొమ్మ ఎప్పుడు పడుతుందో.. తమ కష్టాలు ఎప్పుడు తీరతాయో అనుకుంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇవీ చదవండి... : జీతం లేక.. కూలి పనులు చేస్తున్న అధ్యాపకుడు

ABOUT THE AUTHOR

...view details