ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా భయం.. గుండెపోటుతో యువకుని మృతి.. గ్రామస్థుల ఆందోళన - young man died with heart attack in east godavari news

తనకు కరోనా వచ్చిందేమోనన్న ఆందోళన తూర్పుగోదావరి జిల్లా రామవరంలో ఓ యువకుని ప్రాణాలు తీసింది. మరో ఇద్దరికీ కరోనా పాజిటివ్​గా రావడం వల్ల గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. అధికారులు గ్రామంలో పర్యటించి అందరికీ పరీక్షలు నిర్వహించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

కరోనా భయం.. గుండెపోటుతో యువకుని మృతి.. గ్రామస్థుల ఆందోళన
కరోనా భయం.. గుండెపోటుతో యువకుని మృతి.. గ్రామస్థుల ఆందోళన

By

Published : Jul 19, 2020, 9:11 PM IST

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో శనివారం ఓ యువకుడు కరోనా వచ్చిందేమోనన్న భయంతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. గ్రామంలో మరో ఇద్దరికి కరోనా లక్షణాలు బయటపడడంతో పరీక్షలు చేయగా పాజిటివ్​గా తేలింది. ఈ క్రమంలో గ్రామస్థులు, వారితో సన్నిహితంగా ఉన్న యువకులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని అధికారులు రెడ్​జోన్​గా ప్రకటించారు. అధికారులు గ్రామంలో పర్యటించి అందరికీ పరీక్షలు నిర్వహించాలని.. యువకులకు కౌన్సిలింగ్​ ద్వారా ధైర్యం చెప్పాలని.. మండల తెలుగు యువత అధ్యక్షులు అడబాల వెంకటేశ్వర్లు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details