తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం మండలం కే.ఏనుగుపల్లి లంక గ్రామానికి చెందిన 60 సంవత్సరాల వృద్ధుడికి కరోనా సోకింది. లంక గ్రామంలో ఉన్న ఆ వృద్ధున్ని బోడసకుర్రులోని కొవిడ్ కేర్ సెంటర్కు తరలించాల్సి ఉంది. కానీ... ఏనుగుపల్లి లంక గ్రామం జలదిగ్బంధంలో ఉంది. గ్రామస్తులు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పాజిటివ్ రోగిని పడవలో బయటకు తీసుకు రావాల్సి ఉంది. అయితే.. తమకూ కరోనా సోకుతుందేమో అన్న భయంతో.. ఈ సహాయం చేయడానికి గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ జి.సురేంద్ర ఆ ప్రాంతానికి వెళ్లి... గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్సై మానవత్వంతో ఆ పాజిటివ్ రోగిని తనతోపాటు పడవలో తీసుకువెళ్లి మానవత్వం చాటుకున్నారు. బాధితుడిని బోసకుర్రులోని కొవిడ్ కేర్ కేంద్రానికి చేర్చారు.