కేంద్రమంత్రి రాక కోసం ఎదురుచూసిన వారికి నిరాశ - victims
కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన వారిలో 15మంది జాడ ఇప్పటికీ దొరకలేదు. తమ ఆత్మీయులను కడసారైనా చూసేందుకు బాధిత కుటుంబీకులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద ఏడు రోజులుగా నిరీక్షిస్తున్నారు. మరోవైపు సహాయక చర్యలు కూడా నిలిచిపోవటంతో వారిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. తమ బాధను కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మొరపెట్టుకుందామనుకున్న వారికి నిరాశే ఎదురైంది.
ఎదురుచూపులు
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వస్తారన్న సమాచారంతో బోటు బాధిత కుటుంబాలు ఎదురుచూడగా వారికి నిరాశ ఎదురైంది. తమ బాధలను ఆయనతో చెప్పుకోవాలని ఆశగా వేచి చూసినప్పటికీ కిషన్ రెడ్డి రాలేదు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం ఆర్ & బీ అతిథి గృహంలో నిర్వహించిన విపత్తు నిర్వహణ కమిటీ సమావేశానికి కిషన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆసుపత్రి మీదగా విమానాశ్రయానికి వెళ్లారు.