తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. హుకుంపేట వద్ద టైరు పంక్చర్ కావడం కారు పల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా అందరు సురక్షితంగా బయటపడ్డారు. రోడ్డు పక్కడ ఆగి ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడం వల్ల కొద్దిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
టైరు పంక్చరై కారు పల్టీ.. ప్రయాణికులు సురక్షితం - rajamahendravaram highway accident news
టైరు పంక్చర్ కావడం కారు పల్టీ కొట్టిన ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి కాలేదు. రోడ్డు పక్కన ఆపిన బైకును ఢీకొట్టడం కొద్దిగా ధ్వంసం అయ్యింది.
టైరు పంక్చరై కారు పల్టీ