రంపచోడవరం నియోజకవర్గంలోని 11 మండలాల పరిధిలో ఈనెల 17న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. మెుత్తం 186 పంచాయతీలు, 1734 వార్డులకు సంబంధించి.. నిన్న నుంచి నామ పత్రాల స్వీకరణను ప్రారంభించారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఎన్నికలు జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు 1734 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
రంపచోడవరంలో మూడో విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం
తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మెుదలైంది. మూడో విడతలో భాగంగా నియోజకవర్గంలోని 11 మండలాల పరిధిలోని 186 పంచాయతీలకు... ఈనెల 17న ఎన్నికలు నిర్వహించనున్నారు.
పదకొండు మండలాల్లో 2,60,310 మంది ఓటర్లు ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఓటు వేసేందుకు వెళ్లే ఓటర్లకు వాహన సదుపాయం కల్పించినట్టు ఐటీడీఎ ప్రాజెక్ట్ అధికారి ప్రవీణ్ ఆదిత్య, ఆర్డీవో శీను నాయక్ వెల్లడించారు. పోలింగ్ జరిగిన రోజున మధ్యాహ్నం నుంచి కౌంటింగ్ ఉంటుందని తెలిపారు. అదే రోజు ఉప సర్పంచ్ల ఎన్నిక కూడా జరపనున్నారు. మన్యంలో సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండీ..ఇదీ సంగతి: సర్పంచి నుంచి శాసనసభ వరకు..