ఎంతో చరిత్ర కలిగిన కాకినాడ ప్రభుత్వ ఐటీఐని తరలించాలన్న నిర్ణయాన్ని ఎస్‌ఎఫ్‌ఐ తూర్పు గోదావరి జిల్లా కమిటీ వ్యతిరేకించింది. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొవాలని కోరుతూ ర్యాలీ చేశారు.
కేబినెట్ ఆమోదంతో విడుదలైన జీవో 347 తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 1947లో ఏర్పడిన కళాశాలలో 1400 మంది విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. ఇక్కడి స్థలం వేరే సంస్థకు కేటాయించి విద్యార్థులతో చెలగాటం ఆడొద్దని విన్నవించారు.