ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారత్ ఎఫెక్ట్: నిలువ నీడ లేని వృద్ధురాలికి ఆశ్రయం - a old women residence in toilet

ఒంట్లో శక్తి లేని వృద్ధాప్యం... భరించరాని పేదరికం... ఎవ్వరికీ చెప్పుకోలేని దీనస్థితి. ఉండటానికి ఇల్లు లేక... మరుగుదొడ్డిలోనే జీవనం సాగిస్తోన్న వృద్ధురాలిపై ఈనాడు-ఈటీవీ భారత్ లో వెలువడిన కథనంపై స్పందన లభించింది.

The reaction of the elderly women residence in toilet eenadu-ETVbharat
భారత్ ఎఫెక్ట్: వృద్ధురాలికి ఆశ్రయం కల్పించాలని ఆదేశం

By

Published : Dec 22, 2019, 10:07 PM IST

భారత్ ఎఫెక్ట్: వృద్ధురాలికి ఆశ్రయం కల్పించాలని ఆదేశం

తూర్పు గోదావరి జిల్లా జి.పెదపూడికి చెందిన వృద్ధురాలు... మరుగుదొడ్డిలో నివాసం ఉంటున్న వైనంపై ఈనాడు- ఈటీవీ భారత్ లో వెలువడిన కథనాలకు స్పందన లభించింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇ.సి.హెచ్ కిషోర్ కుమార్, కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జస్టిస్ హిమబిందు స్పందించారు. వెంటనే వృద్ధురాలు వీరమ్మకు ఆశ్రయం కల్పించాలని పి.గన్నవరం తహశీల్దారును ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యుడు లక్కోజు ఓంకార్ జి.పెదపూడి వచ్చి వీరమ్మతో మాట్లాడారు. సీనియర్ సివిల్ జడ్జి... తహశీల్దారుకు ఆదేశిస్తూ ఇచ్చిన లేఖను స్థానిక ఎమ్మార్వోకు అందించారు. వీరమ్మకు ఆశ్రయం కల్పించి వెంటనే తమకు నివేదిక పంపాలని లేఖలో స్పష్టం చేసినట్లు ఆయన తెలిపారు.

పై వార్త పై మరిన్ని వివరాల కోసం -నిలువ నీడ లేదు... అయినవారిని అడగలేదు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details