ఉగాది రోజున పంపిణీ చేసే ఇళ్ల స్థలాల సేకరణ ప్రక్రియ తొమ్మిది జిల్లాల్లో పూర్తయిందని రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి ఉషారాణి స్పష్టం చేశారు. భూములు ఇచ్చేందుకు ప్రైవేటు వ్యక్తులు ముందుకొస్తే మార్కెట్ ప్రకారం ధర చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలంలో ప్రభుత్వ స్థలాలను ఆమె పరిశీలించారు. ఏ విధంగా స్థలాలు కేటాయిస్తున్నారో.. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 3 లక్షల 30 మంది లబ్ధిదారులు ఉన్నారని.. ఇది రాష్ట్రంలోనే ఎక్కువని వెల్లడించారు.
'తొమ్మిది జిల్లాల్లో ఇళ్ల స్థలాల సేకరణ ప్రక్రియ పూర్తయింది' - తూర్పుగోదావరి జిల్లాలో రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి పర్యటన
తొమ్మిది జిల్లాల్లో ఇళ్ల స్థలాల సేకరణ ప్రక్రియ పూర్తయిందని రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి ఉషారాణి స్పష్టంచేశారు. తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన ఆమె... భూములు ఇచ్చేందుకు ప్రైవేటు వ్యక్తులు ముందుకొస్తే మార్కెట్ ప్రకారం ధర చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.
రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి ఉషారాణి
TAGGED:
PRINCIPALSECRETARY_PARYATAN