ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి... దీంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా సబ్సిడీపై ఉల్లిపాయలను సరఫరా చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గణేష్ చౌక్ రైతు బజారు వద్ద సబ్సిడీ ఉల్లిపాయల కోసం నగర ప్రజలు బారులు తీరారు. ఉల్లిపాయలు లేనిదే ఏ కూర వండలేం. అయితే తాజాగా ఉల్లి కిలో రూ.40 నుంచి రూ.60 వరకు పలుకుతోంది. దీంతో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రూ.25 కే సబ్సిడీపై ఉల్లిపాయలను సరఫరా చేస్తున్నారు. రైతు బజార్ ఎస్టేట్ అధికారి రోజి మాట్లాడుతూ.. రేషన్ కార్డు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగి అయితే సంబంధిత ఐడి కార్డు తీసుకొని వస్తే కిలో ఉల్లిపాయలు వారానికొకసారి ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతు బజార్ వద్ద ఒకే కౌంటర్ ఏర్పాటు చేశారని మరొక కౌంటర్ ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందని కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. రేషన్ కార్డు ఉన్నవారికి, ప్రభుత్వ ఉద్యోగులకు సరఫరా చేస్తే మిగతావారి పరిస్థితి ఏంటి అని మరికొందరు ఆరోపిస్తున్నారు.
ఉల్లి కోసం.. రాజమహేంద్రవరం ప్రజల బారులు - The people of Raja Mahendravaram have waiting in que in the farmer's bazaar
ఉల్లికి రెక్కలొచ్చిన వేళ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అందించే సబ్సిడీ ఉల్లిపాయల కోసం రాజమహేంద్రవరం నగర ప్రజలు రైతు బజారులో బారులు తీరారు.
Raja Mahendravaram Ganesh Chowk farmer's bazaar in East Godavari district