తూర్పుగోదావరి జిల్లా తునిలోని రైతుబజార్, మార్కెట్ ప్రాంగణాల్లో జన సంచారం అధికంగా ఉన్నందున అధికారులు అప్రమత్తమయ్యారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొయ్యా మురళీ కృష్ణతో సీఐ రమేష్‌బాబు, కమిషనర్ ప్రసాదరాజు, మార్కెట్ కమిటీ సభ్యుడు క్వాజా సమావేశం నిర్వహించారు. రైతు బజారులో జనాలు గుంపులుగా ఉండకుండా చూసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. పట్టణంలో పలు దుకాణాలు తెరిచి ఉండటంతో వాటిని పోలీసులు మూయించారు. ఆటోలు నడపవద్దని ఆటో డ్రైవర్లును ఆదేశించారు.
తునిలో జనసంచారం... అప్రమత్తమైన అధికారులు
కరోనా వేగంగా వ్యాపిస్తున్నందుకు వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ఆదేశించింది. అయితే తూర్పుగోదావరి జిల్లా తుని రైతుబజార్లో ప్రజలు గుంపులుగా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలెవరూ బయటకు రాకూడదని అవగాహన కల్పించారు.
తునిలో జనసంచారం... అప్రమత్తమైన అధికారులు