తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండ వాగులు పొంగి పొర్లుతున్నాయి. మారేడుమిల్లి మండలం బోదులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవించిన ఓ మహిళ.... బిడ్డను వెంట పెట్టుకొని స్వస్థలమైన పుల్లంగి పంచాయతీ అద్దరివలస గ్రామానికి అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా...కొండవాగు ఉద్ధృతంగా ప్రవహించింది. అంబులెన్సు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో బాలింతతో పాటు బిడ్డను స్థానికులు వాగు దాటించారు.
ఉద్ధృతంగా కొండవాగు...బాలింతను వాగు దాటించిన స్థానికులు - రంపచోడవరం వార్తలు
కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. బాలింతను అంబులెన్స్‌లో ఇంటికి తరలిస్తుండగా ..రంపచోడవరంలోని పుల్లంగి కొండవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో స్థానికులు తల్లి, బిడ్డలను క్షేమంగా వాగు దాటించారు.

బాలింతను వాగు దాటిస్తున్న స్థానికులు