తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన కుడుపూడి పట్టాభి అనారోగ్య కారణంతో మృతి చెందాడు. ఆయన గతంలో శెట్టిబలిజ మహానాడు అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతదేహానికి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు నివాళులర్పించారు.
కుడుపూడి పట్టాబి మృతి పట్ల నేతల సంతాపం - కుడుపూడి పట్టాబి వార్తలు
ఉమ్మడి రాష్ట్ర శెట్టిబలిజ మహానాడు అధ్యక్షుడిగా పని చేసిన కుడుపూడి పట్టాభికి పలువురు ప్రజా ప్రతినిధులు నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
The leaders pay tribute to Kudupudi Pattabi at ravulapalem in east godavari district