తూర్పుగోదావరి జిల్లా అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కోవిడ్ విభాగాన్ని కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా 2000 పడకలు అందుబాటులో ఉండగా.. కిమ్స్‌లో 600 పడకలు ఏర్పాటు చేస్తామన్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి మాత్రమే వైద్య పరీక్షలు చేస్తారని స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
'జాగ్రత్తలు పాటించండి... కరోనాను తరిమికొట్టండి' - Covid cases in KIMS Amalapuram
కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి స్పష్టం చేశారు. అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలోని కోవిడ్ విభాగాన్ని పరిశీలించిన ఆయన.. ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
అమలాపురం కిమ్స్ ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్