తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి సీతానగరం వరకు 25 కిలోమీటర్ల ఆర్ అండ్ బీ రహదారిపై ప్రయాణం దయనీయంగా మారింది. అడుకో గుంతతో దుమ్ము రేగుతూ ప్రయాణీకుల సహనానికి పరీక్ష పెడుతోంది. కాతేరు నుంచి తొర్రేడు, బొబ్బిలంక, జాలిమూడి, కాటవరం, మునికూడలి, రఘుదేవపురం సీతానగరం వరకు ఇలా ప్రతి గామంలోనూ రహదారి తీవ్రంగా దెబ్బతింది. నిత్యం అత్యధిక రర్దీ తో ఉండే ఈ దారి వర్షాలకు మరింతగా ధ్వంసమైంది.
ఈ దారి విస్తరణకు కొన్ని చోట్ల ఇరువైపులా తవ్వేశారు. వర్షాలు రావడంతో పనులు నిలిచాయి. తిరిగి ప్రారంభించినా..నెమ్మదిగా సాగుతున్నాయి. ఇప్పటికే ధ్వంసమైన ఈ రోడ్డుపై ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. గోదావరి వరదల ముందు వరకు వందల సఖ్యంలో ఇసుక లారీలు ఈ రహదారిపై ప్రయాణించేవి. కాటవరం, వంగలపూడి రేవుల్లో ఇసుక తరిలిస్తూ భారీగా వాహనాలు నడిచాయి.