విద్యార్థి మృతిపై కొనసాగుతున్న దర్యాప్తు.. పూర్తయిన పంచనామా - student suicide latest updates
తూర్పుగోదావరి జిల్లా గంగవరంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి ప్రవీణ్ మృతిపై పోలీసు విచారణ కొనసాగుతుంది. మృతదేహాన్ని పంచనామా అనంతరం అతడి స్వగ్రామం పైడిపుట్టకు తరలించారు. విద్యార్థి మరణంతో అతని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
విద్యార్థి మృతిపై కొనసాగుతున్న దర్యాప్తు - పూర్తయిన పంచనామా
తూర్పుగోదావరి జిల్లా గంగవరంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి ప్రవీణ్ కుమార్ దొర ఆత్మహత్యపై పోలీసు విచారణ కొనసాగుతుంది. దర్యప్తులో భాగంగా.. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని పైడిపుట్టకు తీసుకొచ్చారు. ప్రవీణ్ కుమార్ మరణంతో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సంఘటనా స్థలాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్యతో పాటు.. ఏఎస్పీ బిందుమాధవ్, డీడీ సరస్వతి పరిశీలించారు.