తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం అంబేడ్కర్ కాలనీలో విద్యుదాఘాతానికి తాటాకు ఇల్లు దగ్ధమైంది. సుమారు రూ.లక్ష ఆస్తి నష్టం జరగగా.. అందులో నివసిస్తున్న రెండు కుంటుబాలు వీధిన పడ్డాయి. దాంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు.
అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం.. వీధిన పడ్డ రెండు కుటుంబాలు - బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం
పండగ పూట దీపాలతో వెలుగులీనాల్సిన ఓ ఇంట అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. రెండు కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. ఈ ఘటన పి.గన్నవరంలో జరిగింది.
అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం