రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో పిడుగు పడవచ్చని హెచ్చరించింది. జిల్లాల్లోని వై.రామవరం, మారేడుమిల్లి, రంపచోడవరం,గంగవరం, అడ్డతీగల, దేవీపట్నం ప్రాంతాలతో పాటు.. గోకవరం, కోరుకొండ, జగ్గంపేట, ఏలేశ్వరం , వీరబల్లి, రామాపురం, రాయచోటి చిన్నమండెం, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో పిడుగుపాటుకు అవకాశం ఉన్నట్లు తెలిపింది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు, గొర్ల కాపరులు అప్రమత్తంగా ఉండాలని.. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సూచించారు.
ఆ నాలుగు జిల్లాలకు పిడుగు హెచ్చరిక జారీ.. అన్నమయ్య జిల్లాలో భారీ ఈదురుగాలులతో - thunderstorms in ap
Warned to Possible Thunderstorms: రాష్ట్రంలో నాలుగు జిల్లాలను విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగు పడే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
![ఆ నాలుగు జిల్లాలకు పిడుగు హెచ్చరిక జారీ.. అన్నమయ్య జిల్లాలో భారీ ఈదురుగాలులతో పిడుగు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15184030-224-15184030-1651584972338.jpg)
పిడుగు
అన్నమయ్య జిల్లాలో భారీ ఈదురుగాలులతో: అన్నమయ్య జిల్లాలో భారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి రాయచోటి, వీరబల్లి, సుండుపల్లి,రామాపురం, లక్కిరెడ్డిపల్లి మండలాల్లో మామిడి చెట్లు నేలకులాయి. జిల్లాలో 6వేల ఎకరాల్లో మామిడి, బొప్పాయి, అరటి, నిమ్మ తోటలకు నష్టం వాటిల్లింది. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:'పిడుగుపాటుకు 20 మంది మృతి.. 22 జిల్లాలపై ప్రభావం'
Last Updated : May 4, 2022, 1:13 AM IST