లాక్డౌన్ సడలింపులతో.. దైవ దర్శనం ప్రారంభం కావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వల్ల దేవాలయాల్లో ఇప్పటికే జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ఆలయాల్లో ఇప్పటికే కొన్ని సేవలు, కార్యక్రమాలను ఆపేశారు. అందులో శఠగోపం, తలనీలాలు వంటివి. కానీ కొన్ని ప్రాంతాల్లో భక్తులు... స్వామి వారికి తలనీలాలు సమర్పిస్తున్నారు. ఎలాగనుకుంటున్నారు..? తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి 82 రోజుల తర్వాత భక్తులను అనుమతించారు. వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో కేశఖండన శాలను మూసివేశారు. దీంతో తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నిరాశచెంది.. వెనుదిరిగారు. కొంత మంది మాత్రం కొండ దిగువునున్న సెలూన్లకు వెళ్లి తలనీలాలు ఇస్తున్నారు. తలనీలాల మొక్కులు చెల్లించుకోవడానికి ...కొంత క్షౌరన్ని తీసుకెళ్లి స్వామి సన్నిధిలోని హుండీల్లో వేసి మొక్కులు తీర్చుకుంటున్నారు.
హమ్మయ్యా! తలనీలాలు సమర్పించాం.. - అన్నవరం దర్శనం వార్తలు
దేవుడు దగ్గరికి వెళితే.. తలనీలాలిచ్చి, శఠగోపం పెట్టించుకొని, దర్శనం చేసుకుని, హూండీలో కానుకలు వేసిన తర్వాతే... భక్తులు ఇంటికి వెళ్లేవారు. అది ఒకప్పుడు..! ఇప్పుడు..కరోనా కాలం కాబట్టి తలనీలాలు ఇవ్వకుండానే, శఠగోపం లేకుండానే.. రద్దీలేకుండా దైవ దర్శనం చేసుకుంటున్నారు. అయినా భక్తులకు అలాంటి దర్శనంలో లోపం అనిపించిందేమో!..దేవుడికి వినూత్నంగా తలనీలాలు సమర్పిస్తున్నారు. సెలూన్లో గుండుగీయించి..వెంట్రుకలను హుండీలో వేస్తున్నారు.
సెలూనులో తలనీలాలు