ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''బెదిరించాడన్న కోపంతోనే.. హత్య'' - attacks on journalists in AP news

తూర్పు గోదావరి జిల్లా తునిలో కలకలం రేపిన పత్రిక విలేకరి హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ నయిూమ్ ఆస్మి వెల్లడించారు.

the-cop-who-solved-the-murder-of-journalist-satyanarayana-in-eastgodavari-district

By

Published : Oct 30, 2019, 11:19 AM IST

విలేకరి సత్యనారాయణ హత్య కేసును ఛేదించిన పోలీసులు

తూర్పు గోదావరి జిల్లా తునిలో పత్రికా విలేకరి కాతా సత్యనారాయణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ నయీమ్ ఆస్మి విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు నేరస్తులను గుర్తించామని.. అందులో ఆరుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితులు గౌరీ వెంకట రమణ, దొరబాబుల బలహీనతలు, పాత కేసు, వ్యక్తిగత విషయాల్లో విలేకరి సత్యనారాయణ తల దూర్చినట్లు వెల్లడించారు. రౌడీ షీట్ ఓపెన్ చేయిస్తానని వేధించడమే కాక.. సొమ్ములు తీసుకుని ఇతర ఇబ్బందులకు గురి చేయగా పగ పెంచుకుని పథకం ప్రకారం హత్య చేశారని దర్యాప్తులో తేలిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details