ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలెక్టర్ తీరు మార్చుకోవాలి: మండలి డిప్యూటీ ఛైర్మన్ - తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి వార్తలు

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్​ మురళీధర్​ రెడ్డి తీరును శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం తప్పుబట్టారు. సెప్టెంబర్​ నెలలో నిర్వహించిన ఐటీడీఏ సమావేశాన్ని రద్దు చేసి.... మరోసారి సమావేశం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించినా కలెక్టర్ పట్టించుకోవటం లేదని ఆరోపించారు. దీనిపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని చెప్పారు.

reddy subrahmanyam
మీడియా సమావేశం రెడ్డి సుబ్రమణ్యం

By

Published : Dec 19, 2019, 7:21 PM IST

కలెక్టర్​ తీరు మార్చుకోవాలన్న మండలి డిప్యూటీ ఛైర్మన్​ రెడ్డి సుబ్రహ్మణ్యం

సెప్టెంబర్​ నెలలో రంపచోడవరంలో నిబంధనలకు విరుద్ధంగా ఐటీడీఏ సమావేశం నిర్వహించారని శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తెదేపా కార్యాలయంలో సమావేశంలో మాట్లాడిన ఆయన.. సభ్యులకు 15 రోజుల ముందు సమాచారం ఇవ్వకుండా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఐటీడీఏ సమావేశం నిర్వహించడాన్ని తప్పుబట్టారు. అంతేకాకుండా రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న తన పట్ల కలెక్టర్ చులకనగా, అగౌరవంగా ప్రవర్తించారని రెడ్డి సుబ్రహ్మణ్యం ఆరోపించారు. దీనిపై గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం వల్ల గతంలో హైకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు. ఈ సమావేశం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని కోర్టు కూడా చెప్పిందని అన్నారు. మరోసారి సమావేశం నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించినప్పటికీ కలెక్టర్ పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు. దీనిపై కోరు ధిక్కరణ పిటిషన్​ వేయడానికి సైతం వెనుకాడబోనని ఆయన స్పష్టం చేశారు. కలెక్టర్ తీరు మారే వరకు న్యాయ పోరాటం చేస్తానని వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details