తూర్పుగోదావరి జిల్లా నాగులపల్లి పెదయేరు కాలువకు సంబంధించిన వంతెన కూలిపోయింది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు యేరు పొంగిపొర్లుతోంది. దానికి తోడు కాలువలో గుర్రపు డెక్క భారీగా పెరగటం వల్ల నీటి ప్రవాహం ఎక్కువై వంతెన కూలింది. దీంతో మూడురోజులుగా సాగు నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోంది. యేరుకు దిగువన దాదాపు మూడు వేల ఎకరాల్లో రైతులు సాగుచేస్తండగా...నీరు వృథాగా సముద్రంలో కలుస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు సమాచారం అందించినా... స్పందిచంటం లేదని రైతులు వాపోతున్నారు. నీటి వృథాను ఆపకపోతే ఈ ఏడాది పంటకు నీరందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వంతెన కూలింది... నీరు సముద్రంలో కలుస్తోంది! - bridge
కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తూర్పుగోదావరి జిల్లా నాగులపల్లి పెదయేరు కాలువ వంతెన కూలిపోయింది. దీంతో నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది.
కూలిన వంతెన...వృధాగా పోతున్న నీరు