ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కామనగరువులోని ప్రభుత్వ వైద్య కళాశాల శంకుస్థాపనకు సర్వం సిద్ధం - కామనగరువు తాజావార్తలు

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం కామనగరువులో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాలకు సీఎం శంకుస్థాపన చేస్తారని మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. ముఖ్యమంత్రి వర్చువల్​ విధానంలో పాల్గొంటారని పేర్కొన్నారు.

minister viswaroop
ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి పినిపే విశ్వరూప్

By

Published : May 30, 2021, 10:17 AM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం కామనగరువులో ప్రభుత్వ వైద్య కళాశాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. సీఎం జగన్​ వర్చువల్​ పద్ధతిలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.

రూ.500 కోట్లతో వైద్య కళాశాల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంతో సీఎం జగన్​ ముందుంటారని ప్రశంసించారు. కామనగరువులో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయటం ద్వారా… కోనసీమ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి విశ్వరూప్​ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details