ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తిని రక్షించిన స్థానికులు

కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిన ఘటన కొత్తపేట మండలం సావరం రోడ్డులో జరిగింది. గమనించిన స్థానికులు కారులోని వ్యక్తిని రక్షించి.. ఆసుపత్రికి తరలించారు.

By

Published : Apr 26, 2021, 1:42 PM IST

The car crashed into the canal
కాలువలోకి దూసుకెళ్లిన కారు


తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం సావరం రోడ్డులో ఒక కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకుపోయింది. రావులపాలానికి చెందిన సత్తి దొరారెడ్డి అనే వ్యక్తి.. కొత్త పేట వైపు నుంచి రావులపాలెం వైపు కారులో వెళ్తుండగా.. సావరం రోడ్​లోకి వచ్చేసరికి కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికులు.. కారులో వ్యక్తిని బయటకు తీశారు. స్వల్ప గాయాలైన అతడిని రావులపాలెంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details