ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒరిగిన వంతెన... నిలిచేది ఎన్నడు! - ఇంజరం వంతెన వార్తలు

తూర్పుగోదావరి జిల్లా ఇంజరం వద్దనున్న వంతెన... ప్రమాదస్థాయికి చేరుకుంది. ఓ పక్కకు ఒరిపోయింది. దీనిపై ప్రయాణాలు నిషేధించారు. కొత్తవంతెన ఎప్పటివరకూ పూర్తివుతుందోనని ప్రజలుఎదురుచూస్తున్నారు.

The bridge at the East Godavari District  side was in danger
ఒరిగిన వంతెన

By

Published : Dec 23, 2019, 6:10 PM IST

ఒరిగిన వంతెన... నిలిచేది ఎన్నడు!
తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం ఇంజరం వద్ద 4 నెలల క్రితం పంట కాలవపై బ్రిటిష్ కాలం నాటి వంతెన ఒక పక్కకు ఒరిగిపోయింది. రామచంద్రపురం- యానం మధ్య భారీ, చిన్న వాహనాల రాకపోకలను అధికారులు నిషేధించారు. ప్రత్యామ్నాయ మార్గం లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మత్తులు చేపట్టాలంటే పంటకాలువ మూసివేయాలని... అలా చేస్తే సుమారు 5 వేల ఎకరాలకు నీటి సదుపాయం ఉండదని అధికారులు తేల్చారు. ఈ విషయం స్థానికులు అధికారులకు మొరపెట్టుకోగా.. ఇరిగేషన్ అధికారులు పంట కాలువలకు తూములు వేసి నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేశారు. వంతెనపై నుంచి చిన్న వాహనాల అనుమతితో కాస్త ఊరట లభించింది. భారీ వాహనాలను గోవలంక ఏటిగట్టు మీదుగా మళ్లించినా... ఆ మార్గం ప్రమాదభరితంగా ఉందని వాహనాలు వెళ్లడం లేదు. దీని కారణంగా రావులపాలెం, రాజమహేంద్రవరం, రామచంద్రపురం నుంచి యానం చేరుకునేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తవంతెన ఎప్పటివరకూ పూర్తివుతుందోనని ప్రజలుఎదురుచూస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details