కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో 12 ఏళ్ల బాలుడు కరోనాను జయించాడు. గత నెల 15వ తేదీన హైదరాబాద్ నుంచి అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలుడి నుంచి అధికారులు నమూనాలు సేకరించారు. నాలుగు రోజులపాటు ప్రభుత్వ క్వారెంటెన్లో ఉంచి ఆ తర్వాత హోమ్ క్వారెంటెన్కు తరలించారు. 20వ తేదీన కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గత నెలాఖరున, ఈ నెల రెండో తేదీన జరిపిన పరీక్షల్లో నెగిటివ్ రావటంతో ఇంటికి పంపించేశారు.
యానాంలో కరోనాను జయించిన బాలుడు - carona dishrge news in yanam
యానాంలో మొదటి కరోనా కేసుగా నమోదైన హైదరాబాద్కు చెందిన 12 ఏళ్ల బాలుడు కరోనాను జయించాడు.
యానాంలో కరోనాను జయించిన బాలుడు
అధికారుల అభినందనలు
ఆడుతూ పాడుతూ తిరిగే వయసులో తనకు తెలియకుండానే కరోనా సోకినా భయపడకుండా వైద్యులకు .. ప్రభుత్వానికి సహకరించి బాలుడు కరోనాను జయించాడని డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు.. ఇతర సిబ్బంది చప్పట్లతో అభినందిస్తూ ప్రత్యేక వాహనం ఎక్కించారు.. ఆరోగ్య శాఖ అధికారి సత్యనారాయణ, ఎస్పీ భక్తవత్సలం, కోవిడ్ నోడల్ ఆఫీసర్, ఇతర సిబ్బంది బాలుడిని ఇంటి వద్దకు తీసుకెళ్ళి కుటుంబ సభ్యులకు అప్పగించారు.