విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మృతదేహం లభ్యం కావడం సంచలనం రేపుతోంది. కృష్ణాజిల్లా ఆటో నగర్‌కు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ నెల 8న సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరి 9వ తేదీ తెల్లవారుజామున విశాఖపట్నం చేరుకుంది. ఆ తర్వాత డ్రైవర్ మారారు. ఈ సమయంలో సీట్లు అన్నీ పరిశీలించగా ఎవరు లేరు. తిరిగి విశాఖపట్నం నుంచి బయలుదేరిన బస్సు ప్రయాణికులను ఎక్కించుకుంటు వచ్చింది.
ఆర్టీసీ బస్సులో మృతదేహాం.. ఎవరిదీ..?
ఆర్టీసీ బస్సులో మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. సూపర్ లగ్జరీ బస్సులో ఆఖరి సీటు వెనుక భాగంలో... బస్సు వెనుక డోర్‌కు మధ్య మృతదేహం బయటపడింది.
ఉదయం 9:30 గంటల సమయంలో బస్సు తూర్పు గోదావరి జిల్లా అన్నవరం పరిధిలోకి వచ్చింది. ఈ సమయంలో ప్రయాణికులు.. సీట్ల వెనుక భాగంలో వ్యక్తి పడిపోయి ఉన్నాడని చెప్పారు. బస్ నిలిపి డ్రైవర్ వెనక్కి వెళ్లి చూడగా ఆఖరి సీట్ల వెనుక భాగంలో 35 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి మృతిచెంది ఉన్నట్లు గుర్తించాడు. ఆర్టీసీ అధికారుల ద్వారా డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుడు ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవాడు, ఇతని వద్ద ఆధారాలు లేక పోవడానికి కారణం ఏమిటి, బస్సులోకి ఎలా వెళ్లాడు, ఎప్పుడు మరణించాడు ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నీలం రంగు లుంగీ, షర్టు, మొహానికి మాస్క్ మాత్రమే ధరించి ఉన్నాడు. మృతుని వద్ద మారే ఇతర ఆధారాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండీ...ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ వద్ద ప్రమాదం...ఒకరు మృతి