ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్​ తీగలు తగిలి అగ్నిప్రమాదం...ఇల్లు దగ్ధం

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో విద్యుత్ ప్రమాదంలో పూరిళ్లు దగ్ధమైంది. ఇంటిపైన విద్యుత్ తీగల కారణంగా ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంటున్నారు.

Thatched  house got fire
Thatched house got fire

By

Published : Nov 10, 2020, 10:19 PM IST

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా తాటాకు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు భార్య పిల్లలతో ఈ ఇంట్లో నివసిస్తున్నారు. ఈ ఇంటిపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగల కారణంగా మంటలు అంటుకున్నాయని బాధితులు అంటున్నారు. స్థానికులు మంటలు ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

ముమ్మడివరం అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని రెండు గంటలు శ్రమించి మంటలను అదుపు చేశారు. మూడు కుటుంబాల్లోని ఇనుప బీరువాలో ఉన్న బంగారు వస్తువులు మంటల్లో కాలిపోయి.. 5 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించిందని రెవెన్యూ శాఖ అంచనా వేసింది. బాధితులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని స్థానిక శాసనసభ్యుడు పొన్నాడ సతీష్ తెలిపారు.

అగ్ని ప్రమాదంలో కాలిపోయిన బంగారం

ABOUT THE AUTHOR

...view details