ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మిద్దెపై పెరటి తోట పెంపకం... ఆరోగ్యం ఎంతో పదిలం - news updates in amalapuram

ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చేసుకుంటూ అనారోగ్యానికి దూరంగా ఉంటున్నారు. పెరటి తోటలను ఏర్పాటు చేసుకుని స్వయంగా కూరగాయలు పండించుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో మిద్దె తోటలు పెంచుతున్నారు. ఇంటిపైనే కూరగాయలు, పూలు, పండ్లు పండిస్తూ వాటినే వినియోగిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన కొందరు మహిళలు.

terrace-cultivation-in-amalapuram-east-godavari-district
మిద్దెపై పెరటి తోటల పెంపకం

By

Published : Dec 13, 2020, 7:00 PM IST

మిద్దెపైన వివిధ రకాల కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచేందుకు ఉద్యానవనశాఖ అర్బన్ ఫార్మింగ్ ద్వారా గృహిణులకు యూనిట్లు మంజూరు చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో 70 యూనిట్లతో ఏడాది క్రితం మిద్దెసాగును ప్రారంభించారు. మహిళలకు యూనిట్లు అందించే అంశంలో అంబాజీపేటకు చెందిన కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ అనుసంధానకర్తగా నిలుస్తోంది. మిద్దె సాగుకు మహిళకు ఉద్యానవనశాఖ సహాయ సంచాలకుడు మల్లిఖార్జునరావు పలు సూచనలు చేస్తున్నారు. ఫలితంగా డాబాపై 50 నుంచి 150 రకాల మొక్కలను గృహిణిలు ఎంతో ఆసక్తిగా పెంచుతున్నారు.

ప్రతి యూనిట్​కు 10 మట్టితొట్టెలు, నల్లమట్టి, ఎర్రమట్టి, కుళ్లిన కొబ్బరిపొట్టు, వేపపిండి, ట్రైకోడెర్మావిరిడి, ఘన జీవామృతం, జీవన ఎరువులు, రోజ్ క్యాను, స్ప్రేయర్లు తదితరాలు అందిస్తున్నారు. మహిళలకు సాగుపై తర్ఫీదు ఇస్తున్నారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. మిద్దె సాగు విజయవంతం కావటంతో మరికొందరికి యూనిట్లు అందించేందుకు ఉద్యానవనశాఖ సిద్ధమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details