యానాంలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కనకాలపేట గ్రామం గిరి కాలనీకి చెందిన గాడి స్రవంతి యానాంలోని ఎయిడెడ్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. పాఠశాల సమయం ముగిసిన అనంతరం ఇంటికి చేరుకున్న విద్యార్థిని గదిలోకి వెళ్లి ఉరి వేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు..
యానాంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య - యానాంలో విద్యార్థిని ఆత్మహత్య
పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యానాంలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యానాంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది...అప్పటికే మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి.సాగర తీరంలో.. పెరుగుతున్న అరాచకాలు