పోలీసుల అదుపులో మాజీ ఎంపీ హరిరామజోగయ్య.. ఇంటి వద్ద ఉద్రిక్తత - 5 శాతం రిజర్వేషన్ వార్తలు
20:00 January 01
హరిరామజోగయ్య ఇంటికి చేరుకున్న పోలీసులు
కాపు రిజర్వేషన్ల సాధన కోసం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నిరవధిక నిరాహార దీక్ష చేసేందుకు పూనుకున్న మాజీ మంత్రి హరిరామజోగయ్యను పోలీసులు బలవంతంగా అంబులెన్స్‌లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. దీక్ష చేసేందుకు ఆయన నివాసం వద్దే ఆదివారం ఉదయం నుంచి ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నానికి పోలీసులు ఆయన నివాసానికి వెళ్లే రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించారు. బందరు, కాకినాడ అడిషనల్ ఎస్పీలు ఎన్‌వీ రామాంజనేయులు, శ్రీనివాస్, నరసాపురం డీఎస్పీ మనోహరాచారి నేతృత్వంలో జోగయ్యతో మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి రిజర్వేషన్లపై జీవో విడుదల చేసేలా ప్రయత్నించండని జోగయ్య పోలీసులకు తెలిపారు. రాత్రి సుమారు 400 మంది పోలీసుల భద్రత మధ్య జోగయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అంబులెన్సులో ఎక్కించి.... ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం అందింది.
ఇవీ చదవండి: