తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కొవిడ్ కారణంగా పది మంది మృతి చెందారు. పట్టణంలోని కిమ్స్ ఆస్పత్రిలో ఏడుగురు, మరో ఆస్పత్రిలో ముగ్గురు బాధితులు తుదిశ్వాస విడిచారు.
ఈ మృతదేహాలకు మున్సిపల్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ వీఐపీ నాయుడు వెల్లడించారు. ఏప్రిల్ 21 నుంచి సోమవారం వరకు అమలాపురంలో 62 మంది చనిపోయినట్లు ఆయన తెలిపారు.