ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుల్లేటికుర్రులో పది నెలల చిన్నారికి కరోనా - pulletikurru news updates

తూర్పుగోదావరి జిల్లా పుల్లేటికుర్రులో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం అదే కుటుంబంలో పది నెలల చిన్నారికి వైరస్​ సోకింది.

ten month old babu got  Corona positive  in Pullettikur east godavari district
పుల్లేటికుర్రులో పది నెలల బాలుడికి కరోనా పాజిటివ్

By

Published : Jun 26, 2020, 9:19 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని పుల్లేటికుర్రు గ్రామానికి చెందిన పది నెలల చిన్నారికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. వారం రోజుల క్రితం ఈ గ్రామంలో ఇదే కుటుంబానికి చెందిన ఐదుగురికి వైరస్ సోకింది. చిన్నారికి పాజిటివ్​ రావడంపై గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమై.. గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. బయటకు వచ్చేటప్పుడు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details