ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆలయంలో నిబంధనలు ఉల్లంఘించారు.. సస్పెండయ్యారు

లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించి భక్తులకు ఆలయ ప్రవేశం చేయించిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ సిబ్బందిని ఈవో సస్పెండ్ చేశారు. మెుత్తం ఏడుగురిని విధుల నుంచి తప్పించినట్లు తెలిపారు.

ఆలయంలో నిబంధనలు ఉల్లంఘించారు.. సస్పెండయ్యారు
ఆలయంలో నిబంధనలు ఉల్లంఘించారు.. సస్పెండయ్యారు

By

Published : May 10, 2020, 10:49 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినందుకు ఏడుగురు ఉద్యోగులను ఈవో సస్పెండ్ చేశారు. లాక్​డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నా కొంతమంది భక్తులను స్వామి దర్శనానికి అనుమతించిన క్రమంలో ఆ చిత్రాలు సోషల్ మీడియాలో హల్​చల్ చేశాయి.

ఈ క్రమంలో ఆ సమయంలో విధుల్లో ఉన్న దేవస్థాన సూపరింటెండెంట్ రాధాకృష్ణ, సబార్డినేట్ ఆదినారాయణతో పాటు కేశఖండన శాలలో పనిచేస్తున్న ఐదుగురు సిబ్బందిని ఆలయ కార్యనిర్వహణాధికారి ముదునూరు సత్యనారాయణ రాజు సస్పెండ్ చేశారు. లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించి భక్తులకు ఆలయ ప్రవేశం చేయించిన ఘటనపై ఆ గ్రామ రెవెన్యూ అధికారి రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలయ అధికారులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details