ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టిన తెలుగు కార్మికులకు.. బహ్రెయిన్‌లో ఇక్కట్లు తప్పడం లేదు. ఎన్‌ఎస్‌హెచ్ సహజవాయువు, చమురు సంస్థలో నెల రోజుల క్రితం చేరామని.. చుట్టూ ప్లాంట్ల నుంచి వచ్చే గాలులకు ఒక్కొకరు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యానికి చెప్తే పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. కార్మికులను అక్కడి సిబ్బంది చేత కొట్టిస్తున్నారని.. ఒకరి గొంతు నుంచి రక్తం కారుతున్న దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
ఆరువేల మంది ఉపాధి కోసం ఇక్కడికి వచ్చాం. నెల రోజులు అంతా బాగానే గడిచింది. రానురాను ఊపిరి పీల్చుకోవటం సమస్యగా మారింది. చుట్టూ పరిశ్రమలే ఉన్న కారణంగా అధిక మెుత్తంలో విషవాయువులను విడుదల చేస్తున్నాయి. ఈ కాలుష్య వాయువు కారణంగా ఇప్పటికే 35 మంది మరణించారు. ఆ శవాలు నేటి వరకు ఇంటి చేరలేదని.. వారి బంధువులు చెబుతున్నారు. సంస్థ అధికారులను అడిగితే స్పందించటం లేదు. మమ్మల్ని కొడుతూ.. బలవంతంగా పని చేయిస్తున్నారు. ఇండియన్ ఎంబసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. -బాధితుడు