తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన షణ్ముఖేశ్వర్ ఉక్రెయిన్లోని కార్గిల్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్నాడు. ఇటీవల రష్యా.. ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించడంతో అక్కడ ఉండలేక భారత్ కు తిరిగి రాలేక అవస్థలు పడుతున్నారు. తన లాగే సుమారు 2వేల మంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారని షణ్మఖ్ తెలిపారు. అతను ఉంటున్న ప్రాంతాన్ని అక్కడి పరిస్థితులను ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాడు.
ఉక్రెయిన్లో తెలుగు విద్యార్థుల అవస్థలు.. ఆదుకోవాలని విజ్ఞప్తి - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు
ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు అవస్థలకు గురవుతున్నారు. కేంద్రప్రభుత్వం ఉక్రెయిన్లో ఉన్న వారిని తరలిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ.. వాస్తవానికి అలాంటి పరిస్థితులు లేవని వాపోతున్నారు.
భారత ప్రభుత్వం ఉక్రెయిన్లో ఉన్న వారిని తరలిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అలా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తామున్న ప్రాంతం నుంచి ప్రభుత్వం తెలిపిన ప్రాంతానికి చేరుకోవాలంటే 48 గంటల ప్రయాణం చేయవలసి ఉంటుందని.. ప్రభుత్వ ప్రైవేటు ట్రాన్స్ పోర్ట్ పూర్తిగా నిలిపివేయడంతో ఇప్పడు ప్రయాణం చేయడం కష్ట సాధ్యం అన్నారు. వీలైనంత వరకు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి తమ పిల్లలను సురక్షితంగా తరలించాలని షణ్ముఖ్ తల్లి దండ్రులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: