చెరువులో మునిగిపోతున్న ఇద్దరు స్నేహితులను కాపాడి ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయిన శ్రీనివాస తేజస్వి రెడ్డి మృతదేహం కెనడా నుంచి ఇండియాకు చేరింది. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం గ్రామానికి చెందిన తేజస్వీరెడ్డి గత నెల 29వ కెనడాలో మృతి చెందాడు. తేజస్వీరెడ్డి మృతదేహం కోసం కుటుంబ సభ్యులు 15 రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఉన్నత విద్య, ఉద్యోగం రీత్యా మూడు సంవత్సరాలుగా తేజస్వీ రెడ్డి కెనడాలో ఉంటున్నాడు.
తేజస్వీరెడ్డి మృతదేహాన్ని ఇండియాకు తెప్పించాలని కుటుంబ సభ్యులు ఎంపీ వంగా గీతా విశ్వనాథ్‌ను అశ్రయించారు. ఆమె స్పందించి తేజస్వీరెడ్డి మృతదేహాన్ని ఇండియాకు రప్పించారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి అండగా ఉండాల్సిన కుమారుడు ఇలా మృతి చెందటంతో ఆ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.