తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 500 మంది విద్యార్థులకు ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. బెల్లంపూడిలోని ప్రాథమిక పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాల్గొన్నారు. విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం విద్యార్థులకు ఈ విధంగా సేవా కార్యక్రమం అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే చిట్టి బాబు అన్నారు. 'ది రియల్ టీచర్' పేరుతో ఈ సేవా కార్యక్రమాన్ని ఇతరులు సైతం స్వీకరించాలని ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి కె వి శేఖర్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఈ విధంగా పండ్లు పంపిణీ చేస్తామ్నారు. తాము తలపెట్టిన కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పి. గన్నవరంలో ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ - stu giving frits to students in p.gannavaram
ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో 500 మంది విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాల్గొన్నారు. విద్యార్థులకు వారి చేతులు మీదుగా పంచిపెట్టారు.
పిల్లలకు పండ్లు పంచిపెడుతున్న ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు