ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యార్ధుల కోసం ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచన

By

Published : Apr 25, 2021, 7:39 AM IST

Updated : Apr 25, 2021, 9:24 AM IST

స్కూల్లు తెరుచుకున్న నాటి నుంచి విద్యార్ధులపై కరోనా పంజా విసురుతోంది. కరోనా బారి నుంచి విద్యార్ధులను కాపాడేందుకు.. ఆ ఉపాధ్యాయుడు సరికొత్త ఉపాయం కనిపెట్టాడు. విద్యార్ధులు వరుసగా ఆవిరి పట్టేలా చర్యలు చేపట్టాడు.

Teacher innovative experiment on Corona in Ashram School
విద్యార్దులచే ఆవిరి పట్టిస్తున్న ఉపాధ్యాయుడు

విద్యార్దులచే ఆవిరి పట్టిస్తున్న ఉపాధ్యాయుడు
తూర్పు గోదావరి జిల్లా వై. రామవరం మండలం పనసలపాలెంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో గాంధీ బాబు అనే ఉపాధ్యాయుడు కరోనాను నియంత్రించేందుకు.. విద్యార్థులకు ఆవిరి పట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఉపాధ్యాయుడు పొయ్యి ఏర్పాటు చేసి.. దానిపై కుక్కర్​ను పెట్టి జండూ బాం, విక్స్ వంటి వాటిని నీళ్లలో మరగబెట్టి ఆ ఆవిరిని విద్యార్థులకు పడుతున్నారు. ముఖ్యంగా రొంప, దగ్గుతో పాటు ఊపిరి పీల్చడం కష్టంగా ఉన్న విద్యార్థులకు ఈ విధంగా ఆవిరి పట్టేలా చేసి ఉపశమనం కలిగిస్తున్నారు. దీంతో తోటి ఉపాధ్యాయులు అధికారులు గాంధీబాబును ప్రశంసిస్తున్నారు.
Last Updated : Apr 25, 2021, 9:24 AM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details