తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లి పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నిర్మల కుమారి... మహిళలకు శానిటరీ ప్యాడ్స్, రుమాళ్లను అందించారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న పేద మహిళలకు వీటిని అందజేశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న 10 వేల మందికి పంచిపెట్టారు. మహిళలు వ్యక్తిగత పరిశుభ్రతపై తీసుకోవాల్సి జాగ్రత్తల గురించి మహిళలకు అవగాహన కల్పించారు.
మహిళలకు శానిటరీ ప్యాడ్స్, రుమాళ్లు పంచిన ఉపాధ్యాయురాలు - దేవరపల్లి పాఠశాల ఉపాధ్యాయురాలు తాజా వార్తలు
కరోనా కారణంగా ఇబ్బందులు పడిన పేద మహిళలకు ఓ ఉపాధ్యాయురాలు తమ వంతు సాయం చేశారు. రావులపాలెం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న సుమారు 10 వేల మంది మహిళలకు శానిటరీ ప్యాడ్స్, రుమాళ్లను అందించారు.

పేద మహిళలకు శానిటరీ ప్యాడ్స్, రుమాళ్లను పంపకం