తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడుకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయురాలు మృతి చెందారు. మరణానంతరం మృతదేహానికి పరీక్షలు నిర్వహించగా కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీఓ శ్రీలత, పంచాయతీ సిబ్బంది ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలి కుటుంబ సభ్యులంతా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతుండటంతో గ్రామస్థులతో మంచి సంబంధాలున్నాయి. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఉపాధ్యాయురాలు మృతి.. మరణానంతరం పరీక్షల్లో కొవిడ్ గుర్తింపు - corona deaths in east godavari district
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడులో రిటైర్డ్ ఉపాధ్యాయురాలు మరణించడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఆమె మరణానంతరం మృతదేహానికి పరీక్షలు నిర్వహించగా కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
కరోనాతో మృతి చెందిన ఉపాధ్యాయినికి అధికారులు అంత్యక్రియలు
TAGGED:
కరోనా మృతులు తాజా వార్తలు