ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ ద్రోణాచార్యుడు... మరీ ఇంత దారుణమా! - teacher-beat-students

చిన్నారులను ప్రధానోపాధ్యాయుడు చితకబాదిన వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం సంగవక గ్రామంలో జరిగింది.

చిన్నారులను చితకబాదిన ప్రధానోపాధ్యాయుడు

By

Published : Jul 16, 2019, 3:23 PM IST

చిన్నారులను చితకబాదిన ప్రధానోపాధ్యాయుడు

గురువు... మనకు చదువే కాదు... క్రమశిక్షణ, తోటివారితో ఎలా మెలగాలి, సమాజంలో ఎలా నడుచుకోవాలి అనే విషయాలను బోధిస్తాడు. తల్లిదండ్రుల తర్వాత మనం ఏ తప్పు చేసినా క్షమించి... దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో చెప్పే మార్గదర్శి. ఆ గురువే క్రమశిక్షణ తప్పి... మృగంలా మారితే ఈయనలా ఉంటాడేమో అనే స్థాయికి దిగజారాడు ఈ ప్రబుద్ధుడు.

ఏం తప్పు చేశారనో ఏమో.. ఏమీ తెలియని చిన్నారులను చితకబాదాడు స్వయానా పాఠశాల ప్రదానోపాధ్యాయుడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు మండలం సంగవక గ్రామంలో ఆశ్రమ పాఠశాల విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు కర్కశంగా కొట్టిన వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. దీనిని చూసిన తల్లిదండ్రులు అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details