ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రాన్ని వైకాపా జూదాంధ్రప్రదేశ్​గా మారుస్తోంది' - ఒంగోలులో తెదేపా మహిళ నేతల ఆందోళన

రాష్ట్రాన్ని జూదాంధ్రప్రదేశ్​గా వైకాపా ప్రభుత్వం మారుస్తోందని తెదేపా మహిళా ప్రతినిధులు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలలో వారు ఆందోళనలు చేపట్టారు. మంత్రి మాట్లాడే మాటలు పేకాటను ప్రోత్సహించేలా ఉన్నాయని అన్నారు.

tdp  women leaders protest against minister kodali nani comments
తెదేపా మహిళ నేతల ఆందోళన

By

Published : Jan 8, 2021, 6:34 PM IST

Updated : Jan 8, 2021, 8:08 PM IST

ప్రకాశం జిల్లా

తెదేపా మహిళ నేతల ధర్నా

ప్రకాశం జిల్లా ఒంగోలులో తెదేపా మహిళా నాయకులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని అద్దంకి బస్టాండు వద్ద రోడ్డుపై బైఠాయించి పేకాట ఆడారు. మంత్రి కొడాలి నాని బాధ్యత రహితంగా పేకాట మీద చేసిన వ్యాఖ్యలని వారు ఖండించారు. కుటుంబ పెద్దలు పేకాటకు బానిసలు అవ్వడం ద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రిగా ఉండి పేకాట ఆడటం తప్పుకాదన్నట్లు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మహిళా నాయకులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు రావుల పద్మజ, కార్యదర్శి కుసుమకుమారి, పట్టణ మహిళా అధ్యక్షరాలు పద్మ ఇతర మహిళలు పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో తెదేపా మహిళ నేతలు ఖండించారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం.. అక్కడే ఆందోళన నిర్వహించారు.పేకాట క్లబ్బులు నడిపిస్తున్న మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఆన్‌లైన్‌ జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఎం, హోంశాఖ మంత్రి... మద్యం, పేకాటను అరికట్టాలన్నారు. వీటివల్ల మహిళలు బాధపడుతున్నారన్న విషయం ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో సుంకరి పావని, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి.చాగలేరులో పురాతన రాతి వినాయకుడి విగ్రహం అపహరణ

Last Updated : Jan 8, 2021, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details