ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమస్యలపై అధికార ప్రతిపాక్షాలు మాట్లాడాలి: జ్యోతుల నెహ్రు - వైకాపాపై మండిపడ్డ తెదేపా నేత జ్యోతుల నెహ్రు

ప్రజా సమస్యలపై చర్చించకుండా, విలువైన సమయాన్ని శాసనసభలో వైకాపా నాయకులు వృథా చేస్తున్నారని... తెదేపా సీనియర్, మాజీ ఎమ్మెల్యే నాయకులు జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు.

tdp senior leader jyothula nehru fires on ycp behaviour in assembly
శాసనసభలో వైకాపా తీరుపై జ్యోతుల నెహ్రు మండిపాటు

By

Published : Dec 16, 2019, 9:24 AM IST

శాసనసభలో వైకాపా తీరుపై జ్యోతుల నెహ్రు మండిపాటు

ప్రజా సమస్యలపై చర్చించకుండా, విలువైన సమయాన్ని శాసనసభలో వైకాపా నాయకులు వృథా చేస్తున్నారని... తెదేపా సీనియర్, మాజీ ఎమ్మెల్యే నాయకులు జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. జగ్గంపేటలో తన స్వగృహంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం వైఫల్యమైందని దుయ్యబట్టారు. దేవాలయం లాంటి శాసనసభలో మంత్రులు సక్రమంగా వ్యవహరించడం లేదని నెహ్రూ తప్పుపట్టారు. సమస్యలపై మాట్లాడవలసిన బాధ్యత అధికార ప్రతిపక్షాలపై ఉందని ఆయన గుర్తు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details