ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెట్రోల్​పై వ్యాట్ పెంపును నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ - ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ట్యాక్స్​ తాజా న్యూస్

రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్​పై వ్యాట్ పెంపును నిరసిస్తూ రాజమహేంద్రవరంలో తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులు పెడుతోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆరోపించారు.

పెట్రోల్​పై వ్యాట్ పెంపును నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ
పెట్రోల్​పై వ్యాట్ పెంపును నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ

By

Published : Jan 31, 2020, 12:33 PM IST

పెట్రోల్​పై వ్యాట్ పెంపును నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ

రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్​పై వ్యాట్ (వాల్యూ యాడెడ్ టాక్స్) పెంపును నిరసిస్తూ రాజమహేంద్రవరంలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, తెదేపా నాయకుడు ఆదిరెడ్డి వాసు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక కంబాల చెరువు నుంచి గాంధీ విగ్రహం వరకు ద్విచక్రవాహనాన్ని రిక్షాకు కట్టి ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వం పెట్రోల్​పై వ్యాట్​ ను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details