తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మసీదులు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట స్థానిక తెదేపా నేతలు నిరసన తెలిపారు. నిర్మాణ పనుల కోసం గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని గుర్తుచేశారు. కక్ష పూరిత ధోరణితో పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తక్షణం మసీదుల అభివృద్ధి పనులు చేపట్టాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు డిమాండ్ చేశారు.
మసీదుల అభివృద్ధి పనులు చేపట్టాలని తెదేపా నిరసన - east godavari dist latest news
రాజమహేంద్రవరంలో తెదేపా నేతలు నిరసన తెలిపారు. గతంలో మంజూరైన పనులు జరగకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. స్థానికంగా ఉన్న మసీదుల నిర్మాణ పనులు తక్షణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
తెదేపా నిరసన