ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వాడపాలెంలో తెదేపా నేతల నిరసన - వాడపాలెం తెదేపా నేతల తాజా వార్తలు

మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని బలవంతంగా డిశ్చార్జ్ చేయడం పట్ల తెదేపా నేత బండారు సత్యానందరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కొత్తపేట మండలం వాడపాలెంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు.

tdp protest in east godavari district for forceful discharge of ex minister accham naidu
ప్లకార్డులతో నిరసన తెలిపిన వాడపాలెంలో తెదేపా నేతలు

By

Published : Jul 2, 2020, 3:20 PM IST

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలో తెదేపా నేతలు ఆందోళన చేశారు. మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అరెస్ట్​ చేయడమే కాకుండా బలవంతంగా డిశ్చార్జ్​ చేయడం కక్ష సాధింపు చర్యగా సత్యానందరావు ఆరోపించారు. పరామర్శించేందుకు వెళ్లిన వారిని సైతం అనుమతించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పరిస్థితి కుదురుగా లేదని డాక్టర్లు చెబుతున్నా... పట్టించుకోకుండా బలవంతంగా జైలుకు తరలించడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు.

ABOUT THE AUTHOR

...view details