తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో తెదేపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆందోళన చేపట్టారు. ప్రజా పరిరక్షణ సేవాసమితి పేరుతో వైకాపా నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలతో కలిసి ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసుల జోక్యంతో నిరసన విరమించారు.
బిక్కవోలులో తెదేపా అభ్యర్థి నిరసన - 2019 ap elections
బిక్కవోలులో తెదేపా అభ్యర్థి కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. వైకాపా నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని రోడ్డుపై బైఠాయించారు.
బిక్కవోలులో తెదేపా అభ్యర్థి నిరసన