ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతులపై పెట్టిన కేసులను తక్షణమే వెనక్కు తీసుకోవాలి' - thatipaka tdp protest updates

అమరావతి రైతులను జైలుకు పంపించడాన్ని వ్యతిరేకిస్తూ... తూర్పు గోదావరి జిల్లా తాటిపాకలో తెలుగుదేశం నిరసన తెలిపింది. అమరావతినే రాజధానిగా ప్రకటించాలని మాజీ మంత్రి గొల్లపల్లి డిమాండ్ చేశారు.

tdp protest at thatipaka
తాటిపాకలో తెదేపా నిరసన

By

Published : Oct 28, 2020, 9:34 PM IST

రాష్ట్ర రాజధానిగా అమరావతిని కాపాడుకోవడం కోసం ఎస్సీలు, బీసీలు ఉద్యమం చేస్తుంటే వారికి బేడీలు వేసి జైలుకు పంపడం దారుణమని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం తాటిపాకలో తెదేపా ధర్నాకు ఆయన హాజరయ్యారు.

అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి.. నివాళులు అర్పించారు. నిరసనకారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఎస్సీలపై అట్రాసిటీ చట్టం ప్రయోగించడం దేశ చరిత్రలోనే తొలిసారి అని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా అమరావతినే రాజధానిగా ప్రకటించి.....దళితులపై పెట్టిన కేసుల్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి.'పంట నష్టంపై పారదర్శకంగా నివేదిక రూపొందిస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details